ఏపీ ఆర్టీసీ డ్రైవర్లకు కండెక్టర్లకు జగన్ గుడ్ న్యూస్

ఏపీ ఆర్టీసీ డ్రైవర్లకు కండెక్టర్లకు జగన్ గుడ్ న్యూస్

0
87

ఏపీ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారు.. దీంతో ఉద్యోగులు అందరూ ఎంతో సంతోషంలో ఉన్నారు. జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది. ఈ ఏడాది తొలి కార్యక్రమం ఇదే, దాదాపు 50 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల చిరకాల కోరికను తీర్చారు ముఖ్యమంత్రి జగన్..

ఇక వారి ఉద్యోగానికి భరోసా కల్పించారు. అంతేకాదు ఆర్టీసీ అధికారుల హోదాను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆర్టీసీ ఎండీ హోదాను పీటీడీ కమిషనర్‌ లేదా డైరెక్టర్‌గాను, ఈడీలను అడిషనల్‌ కమిషనర్లుగా, ఆర్‌ఎంలు జాయింట్‌ కమిషనర్లుగా చేశారు

ఇక తాజాగా ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న వారికిజగన్ సర్కార్ శుభవార్త అందించింది. ఇకపై వారికి 8గంటలకుపైగా విధులు లేకుండా చర్యలు ప్రారంభించింది. దీనికి కారణం వారికి ఫుల్ డ్యూటీతో సరైన విశ్రాంతి ఉండటం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ డ్రైవర్ అధనంగా పని చేస్తాను అని కోరితేనే అదనపు పని గంటలు డ్యూటీ వేయాలి అని అధికారులకి తెలిపారు.. ఇక మరో గుడ్ న్యూస్ కండెక్టర్లకు కూడా చెప్పారు..ఎవరైనా కండక్టర్లలో ఉన్నత విద్యావంతులు ఉంటే డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లోకి వెళ్లొచ్చు. అలాగే కార్మిక సంఘాలను ఉద్యోగ సంఘాలుగా మార్చుకోవాలని తెలిపింది ఆర్టీసీ.