మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్

0
84

ఏపీ సర్కార్ మందు బాబులకు మరో బిగ్ షాక్ ఇచ్చింది… రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మధ్యం సరఫరాను నిలిపివేయనుంది… ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు..

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు మద్యం డబ్బులకు ప్రభావితం కాకుడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు… ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుందని తెలిపారు…

21 ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని అలాగే 23న మున్సిపల్, నగర పంచాయితీ ఎన్నికలు పోలింగ్ జరుగనుందని తెలిపారు… ఇక 27,29 తేదీల్లో రెండు దశల్లో పంచాయితీ ఎన్నికలు పోలింగ్ జరగనుందని తెలిపారు…