ఏపీ: వైసీపీకి షాక్..ఏకంగా 13 మంది..

AP: Shock to YCP..13 people together ..

0
95

ఏపీ: కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైయస్సార్ పార్టీకి షాక్ తగిలింది. ఏకంగా 13 మంది సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించడంతో..ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది.

ఈరోజు నుండి ఆయా పంచాయతీలలో..వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులను, శానిటేషన్ కార్యక్రమంతో పాటుగా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లుగా తెలియజేశారు.

ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమై..కేవలం వైయస్సార్ పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

(నోట్: సర్పంచ్ పదవికి కాదు)