ఏపీ తెలంగాణ బోర్డర్ లో అంబులెన్స్ లు వెనక్కి పంపుతున్న తెలంగాణ పోలీసులు

ఏపీ తెలంగాణ బోర్డర్ లో అంబులెన్స్ లు వెనక్కి పంపుతున్న తెలంగాణ పోలీసులు

0
82

ఏపీ తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, ఇక చాలా మంది హైదరాబాద్ నగరానికి కోవిడ్ పేషెంట్లను తీసుకువస్తున్నారు, ఇక తాజాగా ఇక్కడ ఆస్పత్రిల్లో కూడా బెడ్లు నిండుకుంటున్నారు, ఇటు పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు పేషెంట్ల రాక పెరుగుతోంది.

కరోనాకు చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే కరోనా రోగులను పోలీసులు అనుమతించట్లేదు.

 సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని, అలాగే ర్నూలు జిల్లా పుల్లూరు టోల్గేట్ దగ్గర తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. కచ్చితంగా అన్నీ పర్మిషన్లు ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

 కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్లను అడ్డుకుని, వాటిని వెనక్కి పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇతర వాహనాలను మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా కరోనా పేషెంట్లతో ఆస్పత్రిలు నిండుకున్నాయి. ఇక ఆ ఆస్పత్రి మేము చేర్చుకుంటామని పర్మిషన్ ఇస్తున్న వారికి మాత్రమే ఇలా ఎంట్రీ ఇస్తున్నారు.