ఏపీ తెలంగాణ‌లో న‌డిచే రైళ్లు ఇవే

ఏపీ తెలంగాణ‌లో న‌డిచే రైళ్లు ఇవే

0
65

జూన్ 1 నుంచి కేంద్రం రైళ్లు న‌డుప‌నుంది, ముందుగా కేవ‌లం 200 రైళ్లు న‌డుపుతాము అని తెలిపింది
అంటే 100 రైళ్లు రానుపోను క‌లిపి రెండు వంద‌ల స‌ర్వీసులు న‌డుస్తాయి, ఇక తెలుగు స్టేట్స్ లోకూడా ఇవి న‌డువ‌నున్నాయి, ఏపీ తెలంగాణ మీదుగా కొన్ని ఎక్స్ ప్రెస్ స‌ర్వీసులు న‌డువ‌నున్నాయి.

ఇక ఉద‌యం నుంచి ట్రైన్ రిజ‌ర్వేష‌న్స్ కూడా స్టార్ట్ చేశారు.. ముందుగా 100 ట్రైన్స్ వివ‌రాల‌ను కూడా తెలిపింది, దీంతో ఆ ట్రైన్స్ ఇక రిజర్వేష‌న్లు కూడా స్టార్ట్ చేశారు, 30 రోజుల వ‌రకూ అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు.

మ‌న తెలుగు స్టేట్స్ కు వ‌చ్చే ట్రైన్స్ ఇవే
ముంబై CST- హైదరాబాద్( హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్)
హౌరా – సికింద్రాబాద్ (ఫలక్ నామా ఎక్స్ ప్రెస్)
న్యూఢిల్లీ – హైదరాబాద్ ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
విశాఖ – న్యూఢిల్లీ( ఏపీ ఎక్స్ ప్రెస్)
గుంటూరు – సికింద్రాబాద్(గోల్కొండ ఎక్స్ ప్రెస్)
తిరుపతి – నిజామాబాద్( రాయలసీమ ఎక్స్ ప్రెస్)
హైదరాబాద్ – విశాఖ( గోదావరి)
సికింద్రాబాద్ – నిజాముద్దీన్(దురంతో).

ఇక 90 నిమిషాల ముందు రిజ‌ర్వేష‌న్ ట్రైన్ టికెట్ తీసుకుని స్టేష‌న్ లోకి రావాలి, బ‌య‌ట వారిని అనుమ‌తించ‌రు, కేవ‌లం టికెట్ ఉన్న‌వారికి మాత్ర‌మే అనుమ‌తి.