ఏపీ తెలంగాణలో ప్రజలు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ఏపీ తెలంగాణలో ప్రజలు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

0
93

ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎంలు, లాక్ డౌన్ ప్రకటించారు, దీంతో ఏపీ తెలంగాణలో ఇక చాలా వరకూ వాణిజ్య సముదాయాలు తెరచుకోవు ..చిన్న చిన్న వ్యాపార సంస్ధలు మాత్రమే తీస్తారు. అవి కూడా పచారీ సామాన్లు షాపులు తెరచి ఉంటాయి.. మందుల షాపులు ఉంటాయి. పాలసెంటర్లు ఉంటాయి.

తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలి అని తెలిపారు.మందులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు కోసం బయటకు వెళ్లవచ్చు. తెలంగాణలో ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది.ఐదుగురు కంటే ఎక్కువ మంది వెళ్లవద్దు అన్నారు, ఇక ప్రభుత్వ ఉద్యోగులు కరెంట్ వాటర్ ,వైద్యం, మీడియా, టెలికం శాఖ ఉద్యోగులు రొటేషన్ పద్దతిలో కొందరు ఉద్యోగం చేస్తారు,

ఇతరులకు కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలి…ఇంటికి వెళ్లిన తర్వాత దుస్తులను వెంటనే ఉతికివేయాలి. ఎండలో ఆరబెట్టాలి. సరుకులపై కూడా శానిటైజర్ చల్లి తర్వాత ఉపయోగించండి అని చెబుతున్నారు, ఇక కచ్చితంగా రోజుకి పదిసార్లు అయినా చేతులు కడుక్కోండి.