ఏపీ ఉపాధ్యాయులు బీ అలర్ట్..సీఎం కొత్త రూల్

0
112

ఇప్పటికే పీఆర్సీ వ్యవహారంలో జగన్ కాస్త కటువుగా ప్రవర్తించడంతో ఉపాధ్యాయుల జగన్ పై రగిలిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీలో పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఏపీ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేస్తూ జగన్ సర్కార్ కొత్త రూల్ అమలుపరిచింది.

ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో వచ్చే నెల మే 20వ తేదీ వరకు ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ కూడా జారీచేసింది.

కేవలం మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మాత్రమే వారికి మినహాయింపు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని వల్ల పదవ తరగతి పరీక్షల అనంతరం కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మే 20 తర్వాత ఏపీ ఉపాధ్యాయులకు సెలవులు ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేసింది. జులై 4వ తేదీ నుంచి నూతన  విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.