ఏపీ తెలంగాణ కి స్పెషల్ రైళ్లు ఇవే – లిస్ట్ ఇదే

ఏపీ తెలంగాణ కి స్పెషల్ రైళ్లు ఇవే - లిస్ట్ ఇదే

0
90

దసరా,దీపావళి పండుగల సీజన్ వచ్చింది అంటే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, చాలా మంది రైలు ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు, ఈ కరోనా సమయంలో కొన్ని ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి, తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి. ఈ మేరకు దక్షణ రైల్వే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఏమిటి అనేది చూద్దాం
తిరుమల ఎక్స్ప్రెస్
నారాయణాద్రి ఎక్స్ప్రెస్
గౌతమి ఎక్స్ప్రెస్
నర్సాపూర్ ఎక్స్ప్రెస్
చార్మినార్ ఎక్స్ప్రెస్
శబరి ఎక్స్ప్రెస్
బెంగళూరు ఎక్స్ప్రెస్
హుబ్లీ ఎక్స్ప్రెస్

దక్షిణ మధ్య రైల్వే 42 స్పెషల్ ట్రైన్స్ను తిప్పనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలోనే నడవనున్నాయి. వీటిల్లో కొన్ని వారానికి 2,3 రోజులు నడుస్తాయి… మరికొన్ని రోజూ నడుస్తాయి. ఇంకొన్ని వీకెండ్లలో నడిచే రైళ్లు ఉన్నాయి.