భారత్ లో కరోనా మహమ్మారి మరింత ఉదృతం అవుతోంది, అయితే దీనికి సరైన సమయంలో అరికట్టేలా లాక్ డౌన్ ప్రవేశ పెట్టారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సమయంలో మొత్తం 21 రోజుల లాక్ డౌన్ అమలు అవుతోంది మన దేశంలో, ఎవరూ బయటకు రాకుండా ఇంటికి పరిమితం అయ్యారు.
ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది, కాని దీనిని పొడిగించే ఉద్దేశం లేదని కేంద్రం సంకేతాలు ఇస్తోంది. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన విద్యావేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు నివేదించారు.
మన దేశంలో ఇలా ఒక లాక్ డౌన్ సరిపోదు అని అంటున్నారు.. మూడు దశల లాక్ డౌన్ ఉండాలి అని చెబుతున్నారు. 21 రోజుల లాక్ డౌన్ పూర్తయ్యాక ఐదు రోజుల విరామం ఇచ్చి రెండో దశలో 28 రోజుల లాక్ డౌన్ ప్రకటించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల కరోనాని పూర్తిగా నిరోధించవచ్చు అని తెలిపారు.