ఏపీకి రావాలి అనుకుంటున్నారా ఇది త‌ప్ప‌నిస‌రి స‌ర్కార్ ప్ర‌క‌ట‌న

ఏపీకి రావాలి అనుకుంటున్నారా ఇది త‌ప్ప‌నిస‌రి స‌ర్కార్ ప్ర‌క‌ట‌న

0
104

దేశ వ్యాప్తంగా నేటి నుంచి అన్ లాక్ 2 అమ‌లులో ఉంటుంది, ఈ స‌మ‌యంలో దేశంలో పూర్తి స్దాయిలో కంటైన్ మెంట్ జోన్లు, రెడ్ జోన్ల‌లో ఆంక్ష‌లు ఉంటాయి, మ‌రింత క‌ఠినంగా లాక్ డౌన్ అమ‌లు చేస్తారు
అయితే తెలంగాణ నుంచి ఏపీకి కూడా చాలా మంది రావాలి అని అనుకుంటున్నారు .

సొంత వాహ‌నాల ద్వారా చాలా మంది వ‌స్తున్నారు.. కార్ రెంట‌ల్ కి తెస్తున్నారు, అయితే ఇప్పుడు కేంద్రం అంత‌రాష్ట్ర ప్ర‌యాణాలు దేశ వ్యాప్తంగా ఎవ‌రు ఎక్క‌డ‌కు అయిన వెళ్ల‌వ‌చ్చు అని తెలిపింది.. ఆంక్ష‌లు ఉండ‌వు అని చెప్పింది.. కాని తాజాగా ఏపీ స‌ర్కార్ మాత్రం స్పంద‌న‌లో అప్లై చేసుకున్న త‌ర్వాత‌‌

తాము ఇచ్చే ఈ పాస్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి అని తెలిపింది, ఈ పాస్ లేక‌పోతే ఏపీకి రానివ్వ‌ము అని అనుమ‌తి ఉండ‌దు అని తెలిపింది, స్పంద‌న‌లో అప్లై చేసుకోవాల్సిందే, ఉద‌యం ఏడు నుంచి రాత్రి ఏడులోపు వాహ‌నాల‌కు అనుమ‌తి ఉంటుంది త‌ర్వాత ఎలాంటి అనుమ‌తి ఉండ‌దు, స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల‌కు మాత్ర‌మే 24 గంట‌లు అనుమ‌తి ఉంటుంది.