ఏపీలో బ‌స్సుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ కొత్త మార్పులు ఇవే ప్ర‌యాణికులు త‌ప్ప‌క తెలుసుకోండి

ఏపీలో బ‌స్సుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ కొత్త మార్పులు ఇవే ప్ర‌యాణికులు త‌ప్ప‌క తెలుసుకోండి

0
94

ఏపీలో గ్రీన్ ఆరెంజ్ జోన్స్ లో బ‌స్సులు తిరిగే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది, ఈ లాక్ డౌన్ పూర్తి అయిన త‌ర్వాత బ‌స్సుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్నారు. ఇక ప‌ల్లెవెలుగులాంటి బ‌స్సుల్లో నిల‌బ‌డి ప్ర‌యాణం ఎవ‌రూ చేయ‌రు, ముగ్గురు సిట్టింగ్ ఉన్న‌చోట ఇద్ద‌రు, సింగిల్ సిటింగ్ ఉంటే ఒక‌రికి మాత్ర‌మే కూర్చొనేందుకు అనుమ‌తి.

ఏపీలో పల్లె వెలుగు బస్సుల్లో 60 సీట్లుంటాయి. వాటిని నడిపితే… వాటిలో 34 మందినే ఎక్కనిస్తారు.సూపర్‌లగ్జరీ బస్సులో 36 సీట్లు ఉంటాయి. వాటిలో 18 సీట్లు ప‌క్క సీట్లు తేసేస్తున్నారు, కేవ‌లం మూడు రోస్ గా వ‌స్తాయి, అందులోనే ప్ర‌యాణం చేయాలి.

అల్ట్రా డీలక్స్‌లో 20 సీట్లు లేపేసి… 8 కొత్తగా అమర్చుతున్నారు. కాబట్టి… 12 సీట్లు తగ్గిపోతాయి.ఏపీలోని 128 డిపోల్లో 800 బస్సుల్లో సీట్లు మార్చేస్తున్నారు. ఇక ప్రైవేట్ బ‌స్సుల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం ఇంకా తీసుకోలేదు, మొత్తానికి ఇది మంచి నిర్ణ‌యం అంటున్నారు ప్ర‌యాణికులు, ఎప్పుడు బ‌స్సులు ప్రారంభం అవుతాయా అని చిక్కుకుపోయిన వారు ఎదురుచూస్తున్నారు .