ఏపీలో బ‌స్సు టికెట్ బుక్ చేసుకున్నారా అయితే ఇది తెలుసుకోండి

ఏపీలో బ‌స్సు టికెట్ బుక్ చేసుకున్నారా అయితే ఇది తెలుసుకోండి

0
96

ఇప్పుడు లాక్ డౌన్ స‌మ‌యం ఇక రవాణా సౌక‌ర్యాలు ఎక్క‌డా లేవు ..దేశంలో ఎక్క‌డ వారు అక్క‌డ ఉండిపోయారు, అయితే ఇప్పుడు చాలా వ‌రకూ ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ తీసేస్తారా లేదా కొన‌సాగిస్తారా అనే అనుమానం చాలా మందికి ఉంది.. అయితే ఇప్ప‌టికే రైల్వే బ‌స్సులు విమానాల ప్ర‌యాణాల‌కు టికెట్స్ కూడా కొంద‌రు బుక్ చేసుకున్నారు.

ముందు అనుకున్న విధంగా లాక్ డౌన్ కొన‌సాగితే మాత్రం ఆ టికెట్స్ క్యాన్సిల్ అవుతాయి అని ఎలాంటి చార్జీలు లేకుండా మొత్తం న‌గ‌దు చెల్లిస్తారు అని అనుకున్నారు.. ఇప్పుడు లాక్ డౌన్ పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో ఏపీలో బ‌స్సు టికెట్లు బుక్ చేసుకున్న వారికి టికెట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి.

తాజాగా బస్సు రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ఏ పీ ఎస్ ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాకే రిజర్వేషన్లు తిరిగి ప్రారంభిస్తామని ఆర్టీసీ తెలిపింది. దీంతో మే నుంచి టికెట్ రిజ‌ర్వేష‌న్లు ఉంటాయి అని కొంద‌రు అంటున్నారు.