ఏపీలో కరోనా టెస్ట్ చేయించుకుంటే అదిరిపోయే గిఫ్ట్…

ఏపీలో కరోనా టెస్ట్ చేయించుకుంటే అదిరిపోయే గిఫ్ట్...

0
76

ప్రస్తుతం కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది… దీన్ని నివారించేందుకు వైసీపీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుంది… అయినా కూడా ఈ మాయదారి మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది… అయితే కోవిడ్ 19ను నివారించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వినూత్న కార్యాక్రమం చేపట్టారు…

పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే వారికి ఆకర్షనీయమైన గిఫ్ట్ లతోపాటు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు… ఈ లక్షణాలు ఉన్నవారు అధికారులకు సమాచారం అందిస్తే ఇంటి వద్దకే వచ్చి వైద్యపరీక్షలు చేస్తామని అన్నారు…

ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు… పరీక్షలు చేయుంచుకున్నవారికి ప్రతీ వారం ఐదుగురు చొప్పున లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి మిక్స్ గ్రైండర్, గ్యాస్ స్టౌ, కుక్కర్ తదితర బహుమతులతో పాటు 5500 క్యాష్ కూడా ఇస్తామని చెప్పారు…