ఏపీలో కీలక నిర్ణయం – కొత్త పించన్లకు అప్లై చేస్తున్నారా ఆ డాక్యుమెంట్ కూడా ఇవ్వాల్సిందే

ఏపీలో కీలక నిర్ణయం - కొత్త పించన్లకు అప్లై చేస్తున్నారా ఆ డాక్యుమెంట్ కూడా ఇవ్వాల్సిందే

0
94

ఏపీలో పింఛన్ లు ఒకటో తారీఖు వచ్చేసరికి అవ్వాతాతలకు అందిస్తోంది జగన్ సర్కార్, నేరుగా వాలంటీర్లు ఇంటికి తీసుకువెళ్లి పించన్లు అందిస్తున్నారు.. అయితే ఇకపై పించన్లు ధరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాల్సిందే, మరీ ముఖ్యంగా ఆధార్ విషయంలో.. మరి తాజాగా వచ్చిన కొత్త రూల్ చూద్దాం.

ఇకపై మీరు పించన్ కి ధరఖాస్తు చేసుకుంటే మీ ఆధార్ కార్డ్ అప్ డేట్ హిస్టరీ కూడా ఇవ్వాలి.. ఇలా ఎందుకు అంటే ఇటీవల చాలా మంది వయసు తక్కువ ఉన్నా సరే , ఆధార్ లో వయసు మార్పుచేసుకుని కొత్తగా పించన్లు రాయించుకున్నారు, ఇలాంటి మోసాలు జరిగినవి గుర్తించింది ప్రభుత్వం. అందుకే ఈనిర్ణయం తీసుకుంది.

దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ప్రింట్ అవుట్ కూడా సమర్పించాలి. ఒకవేళ మీరు వయసు మార్పు చేసి ఉంటే అది రిజక్ట్ అవుతుంది.. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ స్థాయిలోనే ఇలా తప్పులు ఉంటే తిరస్కరిస్తారు. ఒకవేళ నిజంగా మీ వయసు తేడా పడి తప్పు పడితే మీరు సరైన దృవపత్రాలు చూపించి అపీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇక తప్పకుండా పించన్లకోసం అప్లై చేసేవారు ఇది చూసుకోవాల్సిందే.