ఏపీలో మరో ఉద్యమం….

ఏపీలో మరో ఉద్యమం....

0
84

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ వద్ద ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ యూ డబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావు మాట్లాడుతూ.. కరోనా విధులు నిర్వహిస్తున్న పలు రంగాలను కరోనా వారియర్లుగా ప్రకటించిన ప్రభుత్వం…

అయితే విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను మాత్రం విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు… అన్ని రంగాలకు వివిధ రూపాలలో సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల ఇంతవరకు ఏ సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ ,ప్రధాన కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు