ఏపీలో ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసిన వైసీపీ….వరుసగా సైకిల్ దిగిపోతున్న తమ్ముళ్లు…

ఏపీలో ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసిన వైసీపీ....వరుసగా సైకిల్ దిగిపోతున్న తమ్ముళ్లు...

0
97

ఒక వైపు కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తుంటే… మరోవైపు ప్రధాన ప్రతిపక్షతమ్ముళ్లు తట్టాబుట్టా సర్దేసుకుని వైసీపీలోకి జంప్ చేస్తున్నారు.. రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో తమ్ముళ్లు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు…

అలా ఆలోచించి ఇప్పటికే చాలా మంది నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే… ఇక ఇదే క్రమంలో మరికొందరు సైకిల్ దిగి ఫ్యాన్ చెంతకు చేరారు… కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గానికి చెందిన సూమారు 30 కుటుంబాలు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు..

పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు… ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి తీము వైసీపీ తీర్ధం తీసుకున్నామని అన్నారు.. పార్టీ బలోపేతం కోసం తమవంతు కృషి చేస్తామని అన్నారు…