మొత్తానికి మార్చి చివరి వారం నుంచి స్కూళ్లు కాలేజీలు బంద్ అయ్యాయి, దేశంలో అన్నీ కళాశాలలు స్కూల్స్ కరోనాతో మూసివేశారు, అయితే తాజాగా కేంద్రం పలు మార్గదర్శకాలు ఇవ్వడంతో స్కూళ్లు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దం అవుతున్నాయి.
తాజాగా ఏపీలో దీనిపై అడుగు ముందుకు వేశారు..ఏపీలో సెప్టెంబర్ 5న పాఠశాలలు, అక్టోబర్ 15 జూనియర్ కళాశాలలు ప్రారంభించనున్నారు. ఇక సెప్టెంబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఆరోజే విద్యార్దులకి జగనన్న విద్యా కానుక అందిస్తామని మంత్రి చెప్పారు. ఆరోజు స్కూళ్లకు వచ్చే 43 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక అందిస్తామని మంత్రి తెలియచేశారు…ఇక ముందుగానే ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామన్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలు ఉంటాయని తెలిపారు..ఇక అక్టోబర్ 15వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం అవుతాయని మంత్రి సురేష్ వెల్లడించారు.రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21 లోపు అన్ని సెట్లు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.ఇక గత ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు కూడా కాలేజీ స్టార్ట్ అవ్వగానే నిర్వహించనున్నారు.