ఏపీలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది, రోజు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జగన్ సర్కార్ ఎక్కడికక్కడ ఈ వైరస్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గుంటూరు కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి, ఇక చిత్తూరు జిల్లాలో
శ్రీకాళహస్తిలో ఇటీవల ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు.
దీంతో ప్రభుత్వం అక్కడ అలర్ట్ అయింది.. జిల్లా అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తామని ప్రకటించారు. కేసుల తీవ్రత దృష్ట్యా పట్టణంలో లాక్‌డౌన్ సడలింపులు ఉండబోవని స్పష్టం చేశారు.
ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు అని తెలిపారు . నిత్యావసర సరుకులు, మందులను నేరుగా ఇళ్లకే డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.