ఏపీలో టపాసులు ఈ సమయంలోనే కాల్చాలి – సర్కారు కీలక నిర్ణయం

ఏపీలో టపాసులు ఈ సమయంలోనే కాల్చాలి - సర్కారు కీలక నిర్ణయం

0
95

అసలే కరోనా సమయం ఈ సమయంలో గాలి కాలుష్యం తగ్గించాలి అని అందరూ కోరుతున్నారు, ఈ సమయంలో దీపావళి వస్తోంది కాబట్టి భారీగా పొల్యుషన్ గురి అవుతుంది, అందుకే కాలుష్య రహిత టపాసులు మాత్రమే కొనుగోలు చేయాలి అని కూడా చెబుతున్నారు వైద్యులు.

ఇక భారీగా పొల్యుషన్ అయితే కరోనా సోకిన వారికి ఇబ్బందే, అలాగే తగ్గిన వారికి ఇబ్బందే, ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి ఇబ్బంది, కరోనా సోకిన వారు ఈ మందులకి దూరంగా ఉండాలి.. ఈ పొగ అస్సలు పీల్చకూడదు, ఈ సమయంలో ఏపీసర్కారు
దీపావళి సంబరాలపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కరోనా బాధితుల విషయంలో వారిని దృష్టిలో పెట్టుకుని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది, ఇక అమ్మకాలపై కూడాకొన్ని ఆంక్షలు పెట్టారు.
కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు చేయాలి,ఇక టపాసులు అమ్మేచోట శానిటైజర్లు వాడవద్దు అని తెలిపారు.