అప్పటి వరకూ ఆగండి జనసైనికులకు పవన్ పిలుపు

అప్పటి వరకూ ఆగండి జనసైనికులకు పవన్ పిలుపు

0
75

రాజధానిపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన ఏపీలో ప్రకంపనలు రేపింది.. తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి.. ముఖ్యంగా అమరావతిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రైతులు కూడా అమరావతిని మారిస్తే మా పరిస్దితి ఏమిటి అనిప్రశ్నిస్తున్నారు.

అయితే అమరావతి కోసం రాజధానికి రైతులు భూములు ఇచ్చారని వారికి అన్యాయం జరిగితే ఊరుకోము అని అన్నారు పవన్ కల్యాణ్, రాజధాని ప్రాంత రైతులకు జనసేన ఎప్పుడూ భరోసాగా నిలుస్తుందని చెప్పారు పవన్ … వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధానిపై ఇలాంటి ప్రకటనలే చేశారు అని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఓపికపట్టాలని పవన్ రైతులకు సూచించారు. కమిటీ పొందుపరిచిన అంశాల ఆధారంగా స్పందిద్దామని తన పార్టీ నేతలకు తెలియచేశారు పవన్ కల్యాణ్ .
నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నాయకులను రైతుల దగ్గరకు పంపిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ నెల 20న రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారన్నారు.,వీరు అందరూ రైతులతో అక్కడ కమిటీతో చర్చిస్తారు అని పవన్ తెలిపారు, మొత్తానికి పవన్ పిలుపుతో రాజధాని విషయంలో పవన్ మరో పోరాటం చేస్తారేమో అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ మేధావులు