అప్పుడే బయటపడుతున్న లుకలుకలు…

అప్పుడే బయటపడుతున్న లుకలుకలు...

0
87

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది.. ఈ విజయంతో తెలంగాణలో పాగా వేసే అవకాశం దక్కిందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు… దానికి అనుగునంగానే గ్రేటర్ ఎన్నికలపై బలమైన ఆశతో ముందుకు సాగుతున్నారు…

కీలక నేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు… పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ మొన్న దుబ్బాకలో గెలిచిన ఎమ్మెల్యే కూడా గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు… అయితే తీరా అభ్యర్థుల ఎంపిక విషయంలో నేతల మధ్య సఖ్యత కనిపించడంలేదు…

బీఫాం పంపణీలో విభేదాలు బయటపడుతున్నాయి.. కీలక నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి… ఇప్పటికే కుకట్ పల్లి, గోషమహల్ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యలయాల్లో కుర్చీలు గాల్లో లేచాయి ఇక దీనికి పరాకాస్టగా ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తి వీడియో ఒకటి కలకలంరేపుతోంది… కీలక ఎన్నికల సమయంలో పార్టీలో విభేదాలు రావడంతో వాటీ ప్రభావం విజయ అవకాశాల మీద పడే అవకాశం ఉందని అంటున్నారు…