ఏపీఎస్ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

ఏపీఎస్ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

0
92

ఈ వైర‌స్ దాటికి అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు, దారుణంగా కేసులు సంఖ్య బ‌య‌ట‌ప‌డుతోంది, ఈ స‌మ‌యంలో ప్ర‌జా ర‌వాణాకి సంబంధించి చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.. బ‌స్సులు లేక విమానాలు లేక రైలు సర్వీసులు లేక, మే వ‌ర‌కూ అంద‌రూ ఇబ్బంది ప‌డ్డారు.

అయితే బ‌స్సు స‌ర్వీసుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు, మొత్తానికి బ‌స్సు స‌ర్వీసులు ఏపీలో న‌డుస్తున్నాయి, అయితే అంత‌రాష్ట్ర స‌ర్వీసులు మాత్రం ఇప్పుడు ప్రారంభం అయ్యే అవ‌కాశం లేదు అని తెలుస్తోంది.

తాజాగా ఆంధ్రాలో తిరుగుతున్న ఏ బస్ కైనా నగదు రహిత, కాంటాక్ట్ రహిత టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే నిర్ణయించింది..ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నామని అధికారులు తెలిపారు, తాజాగా టికెట్ల జారీ కూడా ఆన్ లైన్ లో చేయ‌నున్నారు
ఇక ప‌లు సేవలను సమర్థవంతంగా అందించేలా సర్వర్ లను అప్ గ్రేడ్ చేసేందుకు 30వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆర్టీసీ వెబ్ సైట్ ను నిలిపివేస్తామని తెలిపింది, అంతేకాదు ఒకేసారి 50 వేల మంది టికెట్ బుకింగ్ చేసుకున్నా ఇబ్బంది ఉండ‌దు అని తెలిపారు.