ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లికి రెడికాబోతుంది… ఇప్పటికి వరకు కూమారి గొడ్డేటి మాధవి గా ఉన్న ఆమె పేరు త్వరలో శ్రీమతిగా మారబోతుంది… బుధవారం ఆమెను ఉదయం సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు పెళ్లికూతురును చేశారు…
ఆ తర్వాత కుటుంబ సభ్యులు బంధువులు ఆమెను ఆశీర్వదించారు… సెయింట్ థెరెసా పాఠశాల కరస్పాండెంట్ కుసిరెడ్డి శిప్రసాద్ తో వివాహం జరుగనుంది… కాగా లోక్ సభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్సు కలిగిన ఎంపీగా ఆమె రికార్డ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసంది… ఆమే లోక్ సభకు ఎన్నికఅయినప్పుడు వయస్సు 25 సంవత్సరాల 3 నెలలు. అంతకు ముందు లోక్ సభకు యంగ్ ఎంపీగా దుష్యంత్ చౌతాలా ఉన్నారు.
ఆమె ఎంపీగా ఎన్నికైనప్పుడు 26 సంవత్సరాల 3 నెలలు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున మాధవి పోటీ చేసి ఆమె రికార్డ్ ను బద్దలు కొట్టారు. ఈ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ తరపున మాధవి పోటీచేసి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్ పై సమారు 2 లక్షల 21వెయ్యి మెజార్టీతో గెలిచారు.