అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి ఎలా చేస్తారు పూర్తి వివ‌రం

అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి ఎలా చేస్తారు పూర్తి వివ‌రం

0
118

ఈ వైర‌స్ పై పోరాటంలో అంద‌రూ ముందు ఉన్నారు, అయితే ఈ వైర‌స్ ని అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ త‌యారిలో అంద‌రూ బిజీగా ఉన్నారు, అయితే ఈ వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న వేళ మ‌న‌దేశంలో ఓ కొత్త థెర‌పీ తెర‌పైకి వ‌చ్చింది. అదే ప్లాస్మా థెరపీ.

అసలు ఈ ప్లాస్మా థెరపీ విధానం చూద్దాం.. ముందు ఈవైరస్ నుండి కోరుకున్న వ్యక్తి దగ్గర నుండి రక్తాన్ని సేకరిస్తారు, ఇలా సేక‌రించిన బ్ల‌డ్ ఆస్పెరిస్ విధానం ద్వారా రక్తం నుండి ప్లాస్మా ను వేరు చేస్తారు. మిగిలిన రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతాయి. ఒక డోనర్ నుంచి 800 మిల్లీ లీటర్ వరకు ప్లాస్మా తీయవచ్చు. ఇలా ఒక్కో కరోనా బాధితుడికి 200 మిల్లీ లీటర్ ల ప్లాస్మా అవసరం అవుతోంది. అలా ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మా తో నలుగురికి చికిత్స చేయ‌వ‌చ్చు. డోన‌ర్స్ ముందుకు వ‌స్తే ఇది చాలా సులుభం.

వైరస్ వచ్చి డిశ్చార్జి అయినా వారి దగ్గర నుంచి 14 రోజులు వారు కోలుకున్న తరువాత ప్లాస్మా ను తీసుకుంటారు. ఇలా తీసుకున్న త‌ర్వాత రెడ్ అండ్ వైట్ సెల్స్ వేరు చేస్తారు, ఇలా చేసిన తర్వాత మిగిలింది ప్లాస్మా అంటారు.రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలో ప్రవేశించే బాక్టీరియా మరియు వైరస్ నీ చంపే యాంటీబాడీలు ఇందులో ఉంటాయి.

ఇలా కోలుకున్న వ్య‌క్తుల నుంచి ఇది సేక‌రించిన త‌ర్వాత ఈ ప్లాస్మా వైరస్ కణాలకు అతుక్కుని ఉన్నా వైరస్ కణాలను తెల్ల రక్త కణాలు గుర్తించి నాశనం చేస్తాయి. ఇలా ఆ వ్య‌క్తి కోలుకుంటాడు.