అస‌లు W.H.O ఏం చేస్తుంది? దాని వ‌న‌రులు తెలిస్తే మ‌తిపోతుంది

అస‌లు W.H.O ఏం చేస్తుంది? దాని వ‌న‌రులు తెలిస్తే మ‌తిపోతుంది

0
75

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇది ప్ర‌పంచంలో అంద‌రికి తెలిసిన సంస్ధ‌, ఏ దేశంలో ఎలాంటి ఆప‌ద‌వ వ‌చ్చినా వెంట‌నే ముందు W.H.O కి తెలియ‌చేస్తారు, అలాగే వారుఅల‌ర్ట్ అవుతారు, దాని ప్ర‌భావం ప్ర‌పంచం పై ఉంటే వెంట‌నే అంద‌రిని అల‌ర్ట్ చేస్తుంది.

ఇటీవ‌ల చైనాలో ప్రారంభమైన మహమ్మారి కరోనా గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో ఆరోగ్యసంస్థ విఫలమైందన్నది అమెరికా ఆరోపణ చేసింది, అంతేకాదు ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఈ W.H.O సంస్ధ‌కు నిధులు కూడా ఇచ్చేది లేదు అని ఆర్డ‌ర్ పాస్ చేశారు.

అస‌లు W.H.O ఏం చేస్తుంది అంటే ప్రపంచంలో ఐరాస సభ్యత్యమున్న దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ ఆరోగ్యసంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వ్యాధుల సంక్రమణ, కొత్తవ్యాధులపై హెచ్చరికలతో పాటు పలు దేశాల్లోని పరిశోధకులతో కలిసి అనేక వ్యాధులపై పరిశోధనలు నిర్వహిస్తోంది. దీనిని 1945 లో స్ధాపించారు, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌లో అన్నీ దేశాలు క‌లిసి ముందుకు వెళ్లాలి అని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అలా 1948 ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్యసంస్థను ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. ఏకొత్త వ్యాధి వ‌చ్చినా తీవ్ర ప‌రిణామాలు ఉన్నా వారి సిబ్బంది వెంట‌నే అక్క‌డ సేవ‌లు చేస్తారు, ఇత‌ర దేశాల‌ను అల‌ర్ట్ చేస్తారు… ప్రపంచ ఆరోగ్యసంస్థకు 5 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు పైగా బడ్జెట్‌ ఉంది. ఇందులో అమెరికా దాదాపు 900 మిలియన్లను విరాళంగా ఇస్తోంది.