సోనియా, రాహుల్ గాంధీ కాదు..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గహ్లోత్‌ Vs శశిథరూర్

0
79
Telangana Congress Party

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోవడం, అలాగే AICC పీఠంపై రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోవడంతో ఈసారి అధ్యక్ష పీఠాన్ని గాంధీయేతర వ్యక్తి దక్కించుకోనున్నాడు. అయితే అధ్యక్ష రేసులో ముఖ్యంగా ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ కాగా మరొకరు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్. కాగా అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19వ తేదీన కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.