ఎంపీ మాట నిజమేనా టీడీపీ క్లీన్ స్వీపా

ఎంపీ మాట నిజమేనా టీడీపీ క్లీన్ స్వీపా

0
122

ఉత్తరాంధ్రాలో బీసీ బెల్ట్ ఎక్కువ, అదే ఓటు బ్యాంకు అండి , అక్కడ ఈసారి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.. అంతేకాదు ఇక్కడ గెలుపు గుర్రాలను బరిలోకి దించాము అని ఈసారి తొమ్మిదికి తొమ్మిది స్ధానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెబుతున్నారు నేతలు. 23న వెలువడే ఫలితాల్లో జిల్లాలో టీడీపీ క్లీన్స్వీప్ చేస్తుందని.. 9 నియోజకవర్గాలు మనవే అని బొబ్బిలిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మాజీమంత్రి, ఎంపీ పి.అశోక్గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్కృష్ణ రంగారావు కార్యకర్తల్లో ధైర్యం నింపారు.

ఇలాగే ఎన్నికల ముందు కూడా ఎంతో దైర్యం ఆశ కనిపించింది.. ఫలితాల తర్వాత కూడా ఇలాగే అందరూ ఉంటారు అని అక్కడ నేతలు తెలియచేశారు..సాలూరు, పార్వతీపురం, కురుపాంలో టఫ్ ఫైట్ కొనసాగింది ఇక్కడ బెట్టింగులు కూడా జోరు అందుకున్నాయి దీంతో పెద్ద ఎత్తున నేతలు ఎవరు గెలుస్తారా అని బెట్టింగుల్లో మునిగిపోయారట ఇప్పుడు ఈ వార్తలు అక్కడ వినిపిస్తున్నాయి.