ఇప్పటి వరకూ మనం రాజకీయంగా తండ్రి కొడుకులు అలాగే తండ్రి కూతురు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం చూశాం…అంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం… కానీ ఫస్ట్ టైమ్ అల్లుడు మామ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు….మరి ఎక్కడ అనుకుంటున్నారా.. ఇటీవలే వచ్చిన కేరళ ఫలితాల్లో వీరిద్దరూ గెలిచారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మాదమ్ నుంచి 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు, ఇక ఆయన అల్లుడు మహ్మద్ రియాజ్ కోజికోడ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇలా ఒకేసారి మామ అల్లుడు ఇద్దరూ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
అయితే ఆయనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి అంటున్నారు అక్కడ నేతలు.
విజయన్ కూతురు వీణ భర్త రియాజ్, వీరి పెళ్లి గతేడాది జూన్లో నిరాడంబరంగా జరిగింది.
మామ అల్లుడు ఇలా ఒకేసారి ఎన్నిక కావడం ఇక కేరళ చరిత్రలో ఇప్పటి వరకూ ఇలా జరగలేదు అని ఇదే తొలిసారి అని అక్కడ విశ్లేషకులు అంటున్నారు…ఎల్డీఎఫ్ పార్టీ కేరళలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.