మధ్యప్రదేశ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రద్దు అయ్యాయి… షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగాల్సి ఉంది… ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని స్పీకర్ నిర్వహించారు…
కరోనా నేపథ్యంలో వర్షాకాల సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు… మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య 20 వేలకు దాటగా ఇప్పటి వరకు 689 మంది మరణించారు…
ఈ పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహించడం సబబు కాదని నిర్ణయించారు… ఈ మేరకు ప్రభుత్వ విన్నపాన్ని కూడా ప్రతిపక్షాలు అంగీకరించాయి.. దీంతో సమావేశాలు రద్దుచేయాలని నిర్ణయించారు…