స్టాలిన్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సైన్ …. డీల్ ఎంతంటే

స్టాలిన్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సైన్ .... డీల్ ఎంతంటే

0
91

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఎంత పేరు ఉందో తెలుసు.. బీహర్ లో నితీష్ సీఎం అవ్వడానికి ఆయన వ్యూహాలు కారణం అయ్యాయి, ఆనాడు గుజరాత్ లో నరేంద్రమోదీకి వర్క చేశారు, తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రధాని కావడానికి వర్క్ చేశారు,

ఇక పంజాబ్ లో అక్కడ సీఎం కోసం వర్క్ చేశారు, రాహుల్ గాంధీకి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం వర్క్ చేశారు కాని ఆయన అక్కడ విజయం సాధించలేదు. తర్వాత ఏపీలో జగన్ కు వ్యూహకర్తగా ఉన్నారు, ఇక్కడ విజయం సాధించారు, ఇప్పుడు దిల్లీలో కేజ్రీవాల్ కు వ్యూహకర్తగా ఆ పార్టీకి ఉన్నారు, ఈ నెలలో దిల్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి.

ఇక త్రుణముల్ కాంగ్రెస్ కు బెంగాల్ లో దీదీ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు, అక్కడ కూడా ఆమె గెలుపుకి పార్టీకి వర్క్ చేస్తున్నారు.. ఈ సమయంలో ప్రశాంత్ కిశోర్ సేవలు అందుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారు. పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రజలను ఆకట్టుకునేలా ప్రణాళికల రచిస్తున్నారు .అయితే ఈ డీల్ కూడా భారీగానే ఉంటుంది అని తెలుస్తోంది.