ఏటీఎం దగ్గర స్కాన్ చేస్తే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు– కొత్త ఫీచర్

ఏటీఎం దగ్గర స్కాన్ చేస్తే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు-- కొత్త ఫీచర్

0
108

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా మనం డెబిట్ కార్డు ఉపయోగించి నగదు తీసుకుంటాం, అయితే ఇక మీరు డెబిట్ కార్డు లేకపోయినా నగదు తీసుకోవచ్చు, త్వరలో సరికొత్త సర్వీసులు రాబోతున్నాయి..

యాప్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది రానున్న రోజుల్లో.

 

 

ఎన్సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయెల్ సర్వీసులను తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు యూపీఐ యాప్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, అక్కడ ఏటీఎం సెంటర్ దగ్గర ఈ స్కాన్ చేసి నగదు ఎంత కావాలో ఎంటర్ చేస్తారు, దీంతో మీకు నగదు వస్తుంది.

 

సిటీ యూనియన బ్యాంక్ ఇప్పటికే ఎన్సీఆర్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్ 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్తో అప్గ్రేడ్ చేయనుంది. మరి ఇది ఎలా అంటే ఓసారి చూద్దాం….ముందు మీరు యూపీఐ యాప్ ఓపెన్ చేస్తారు.. ఏది అయినా సరే భీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలా వాటిని ఓపెన్ చేసి ఏటీఎం సెంటర్ దగ్గర ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తారు.. మీకు నగదు ఎంత కావాలి అనేది ఎంటర్ చేస్తారు, ఇలా మినిమం మీరు 5 వేల వరకూ తీసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి నగదు తీసుకోవచ్చు.