ఆత్మ‌కూరు ఉపఎన్నికకు సర్వం సిద్ధం..రేపే పోలింగ్

0
84

ఏపీ మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హఠాన్మారణంతో ఆత్మ‌కూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక‌ అనివార్యమైంది. దీనికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా..పోలింగ్ కోసం 279 కేంద్రాల ఏర్పాటు చేశారు.

అలాగే  1132 మంది పోలింగ్ సిబ్బంది, 148 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టింగ్, మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే… గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఈ ఉపఎన్నిక‌లో వైసీపీ త‌న అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డినే బ‌రిలోకి దించింది. దీంతో సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఈ క్ర‌మంలో వైసీపీ అభ్యర్థితో పాటు బీజేపీ స‌హా మొత్తం 14 మంది ఈ ఎన్నికల బ‌రిలో నిలిచారు.