ఏటీఎం సెంటర్ కు వెళ్లి మనం నగదు తెచ్చుకుంటాం, అయితే ఒక్కోసారి ఇక్కడ
ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావడం కూడా జరుగుతుంది.. ముఖ్యంగా పలు కారణాలు ఉంటాయి.. టెక్నికల్ సమస్యలు ఉంటాయి, అయితే ఏటీఎంలో డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంది. ఒక్కోసారి పిన్ నెంబర్ తప్పు ఎంటర్ చేసినా ఫెయిల్ అవుతుంది.
ఏటీఎంలో డబ్బులు ఉన్నా, పిన్ నెంబర్ సరిగ్గానే ఎంటర్ చేసినా ట్రాన్సాక్షన్స్ ఒక్కోసారి ఫెయిల్ అయిన ఘటనలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ అకౌంట్ లో నగదు కట్ అవుతుంది కాని మిషన్ నుంచి నగదు రాదు.. దీంతో కస్టమర్ ఆందోళన చెందుతాడు.. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అనేది చూద్దాం.
1.. ముందు కచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్ స్లిప్ జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోవాలి
2. ఒకవేళ స్లిప్ రాకపోతే డిస్ ప్లే అయినది కూడా మీ దగ్గర ఫోటో తీసుకోవాలి
3. ఒకవేళ ఇలా ఫెయిల్ అయిన లావాదేవీ నగదు 24 గంటల్లో మీ ఖాతాకి క్రెడిట్ అవ్వకపోతే
ఏటీఎం ట్రాన్సాక్షన్ స్లిప్లో ఉన్న రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోండి.
ఇక కట్ అయిన అమౌంట్ కనిపిస్తుంది
24 గంటల్లో మీకు ఆ నగదు జమ అవ్వనట్లు చూపిస్తుంది
మీ బ్యాంకు కస్టమర్ కేర్కు కాల్ చేసి కంప్లైంట్ చేయండి.
ఇక అక్కడ ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీకి మీరు ఆ నెంబర్ రాసి ఇవ్వచ్చు స్లిప్ పైది
అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంటే అందులో వేయవచ్చు
మీ బ్యాంకు అఫీషియల్ ఈ మెయిల్ ఐడీకి కూడా మెయిల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు
సో మీకు ఈజీగా నగదు మళ్లీ క్రెడిట్ అవుతుంది
ఇక నేరుగా బ్యాంకుకి వెళ్లి కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు