మనం ఎంత అందంగా కనిపించినా మనం ధరించే బట్టలు కూడా మనకు లుక్ ఇస్తాయి… ఇందులో ముఖ్యంగా టైలర్ కుట్టిన బట్టల వల్ల మనకు అందం ఉంటుంది.. అయితే ఇలాంటి టైలర్ పై దారుణంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి… తన షర్టు సరిగా కుట్టలేదనే కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి టైలర్ పై అమానుషానికి దిగాడు, ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం.
రాయ్ బరేలికి చెందిన అబ్దుల్ అనే 65 ఏళ్ల టైలర్ కు సలీం అనే వ్యక్తి ఓ షర్టు క్లాత్ ఇచ్చాడు… షర్ట్ కుట్టాలి అని చెప్పాడు.. కొన్ని రోజులకి షర్టు కుట్టాను అని చెప్పాడు… అతను వచ్చి షర్టు వేసుకున్నాడు కాని ఆ షర్టు మాత్రం కురచ అయింది…
చాలా టైటుగా ఉందని టైలర్ పై సలీం ఆగ్రహం వ్యక్తం చేశాడు…. చివరకు మాటా మాటా పెరిగి గొడవకు దిగారు.
టైలర్ అబ్దుల్ మజీద్ ఖాన్ ను అక్కడే ఉన్న కత్తెరతో గొంతుకోసం చంపేశాడు సలీం. అక్కడ నుంచి సలీం పారిపోయాడు, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన విని అందరూ షాక్ అయ్యారు…ఇదేం దారుణం ఇలాంటి వ్యక్తికి కచ్చితంగా శిక్ష పడాలి అంటున్నారు.