ఆగస్టు 5 నుంచి జిమ్ కి వెళ్లేవారు ఇవి త‌ప్ప‌క తెలుసుకోండి కొత్త రూల్స్

ఆగస్టు 5 నుంచి జిమ్ కి వెళ్లేవారు ఇవి త‌ప్ప‌క తెలుసుకోండి కొత్త రూల్స్

0
138

మ‌న దేశంలో అన్‌లాక్ 3 ప్రక్రియ ప్రారంభం అయింది, అయితే ఆగస్టు 5 నుంచి జిమ్‌లు , యోగా సెంటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది, అయితే గ‌తంలో వెళ్లేమాదిరి కాకుండా ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, త‌ప్ప‌కుండా ఇవి పాటించాలి అని తెలియ‌చేస్తున్నారు.

ఆగస్టు 5 నుంచి జిమ్‌లు , యోగా సెంటర్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి, క‌చ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ జిమ్ చేసుకోవాలి, వీలైతే షిఫ్ట్ రూపంలో కొంద‌రికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చుకోవాలి,
జిమ్ ట్రైనర్లు, సిబ్బంది సహా అందరూ మాస్క్ ధ‌రించాలి.

ప్రతి ఒక్కరి మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ ఉండాలని గైడ్ లైన్స్ లో ఉంది. కంటెయిన్మెంట్ జోన్‌లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇక స్పాలు పూల్స్ తెర‌వ‌కూడ‌దు అని తెలిపారు,
65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు పిల్లలు క్లోజ్డ్ జిమ్స్ ఉపయోగించకూడదు. ఎగ్జిట్ ఎంట్రీ మార్గ్ ఉండాలి, శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచాలి
జిమ్ పరికరాల్ని, ఫ్లోర్ ను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.