ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకి 100 కోట్ల జంతువులు మరణం ఇంకా ఏం దారుణాలు జరిగాయంటే

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకి 100 కోట్ల జంతువులు మరణం ఇంకా ఏం దారుణాలు జరిగాయంటే

0
98

మనం పర్యావరణం నాశనం చేస్తే చివరకు మనమే బుగ్గిపాలు అవుతాం.. తాజాగా జరిగే ఘటనలే బెస్ట్ ఉదాహరణలు.. ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు పెద్ద ఎత్తున మూగజీవాలు మరణిస్తున్నాయి… వాటిని చూస్తుంటే కన్నీరు వస్తుంది… అటవీ, ఇతర ప్రాంతాల్లో వ్యాపించిన మంటలకు 100 కోట్లకు పైగా జంతువులు చనిపోయినట్లు సిడ్నీ విశ్వవిద్యాలయం అధికారులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు..

ఒక్క న్యూ సౌత్వేల్స్లోనే 80 కోట్ల మూగజీవులు మంటల్లో మృతి చెందాయట… దాదాపు 48 కోట్ల జంతువులు నాలుగు రోజుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది, ప్రపంచంలో ఇంత పెద్ద దారుణం ఎక్కడా ఈ శతాబ్దంలో జరగలేదు, క్షణాల్లో వ్యాపిస్తున్న మంటలతో కనీవినీ ఎరుగని నష్టం వాటిల్లుతోంది.. ఆ దేశంలోని న్యూసౌత్ వేల్స్లోని మధ్య దక్షిణ తీరంలో ఉన్న కంగారూ అభయారణ్యానికి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు వేలాది కంగారులు మరణించాయి.. కార్చిచ్చుతో వెలువడుతున్న దట్టమైన పొగలు బ్రెజిల్కు కూడా చేరాయి.

ఇలాంటి కార్చిచ్చులు అమెరికాకి ఆస్ట్రేలియాకు కొత్తేమి కాదు. ఏడాది పొడవున ఎక్కడో అక్కడ సంభవిస్తూనే ఉంటాయి. కానీ, ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో అగ్గి రాజుకుంటోంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఇప్పటివరకు 23 మంది మృతిచెందగా, 3000 ఇళ్లు కాలి బూడిదయ్యయి. 1.35 కోట్ల ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతైంది. ఇది డెన్మార్క్, నెదర్లాండ్ దేశాల విస్తీర్ణంతో సమానం. దీంతో మిగిలిన దేశాలు కూడా వారికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈ పొగ మంటల వల్ల వారి ఆరోగ్యంపై ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది.