టీడీపీ, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి భారీ వలసలు

టీడీపీ, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి భారీ వలసలు

0
84

రానున్న మరికొద్దిరోజుల్లో ఏపీలో టీడీపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేశ్ ఆలాగే బావమరిది బాలకృష్ణలు తప్ప పార్టీలో ఎవ్వరు ఉండేలా కనిపించకున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు…

జగన్ పరిపాలన చూసి రాష్ట్రంలో టీడీపీ కోలుకోవాలంటే సుమారు 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంలో చాలామంది వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీలో చేరగా తాజాగా మరికొందరు వైసీపీలో చేరారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు

వీరందరు మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు… ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో తొలిప్రయత్నంలోనే అదీప్ రాజ్ విజయం సాధించారంటే అది కార్యకర్తల శ్రమే అని పేర్కొన్నారు..