అవి కూడా హోం డెలివ‌రీ చేయ‌నున్న‌ అమెజాన్

అవి కూడా హోం డెలివ‌రీ చేయ‌నున్న‌ అమెజాన్

0
97

ఈ వైర‌స్ ప్ర‌భావంతో చాలా వ‌ర‌కూ ఆర్దిక ఇబ్బందులు ప‌డుతున్నారు జ‌నం, ఓప‌క్క ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర కూడా న‌గ‌దు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. అందుకే ప్ర‌భుత్వాలు కూడా మ‌ద్యం షాపులు తెరిచాయి.. దీంతో ఆదాయం క‌నిపిస్తోంది. ఇక ఆన్ లైన్ సంస్ధ‌ల‌కు డోర్ డెలివ‌రీకి కూడా మ‌ద్యం ఇవ్వ‌నున్నాయి కొన్ని సం‌స్ద‌లు.

ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే దీనిపై ఒప్పందం చేసుకుంటున్నాయి.. దేశంలోనే మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మద్యాన్ని సరఫరా చేయనుంది అమెజాన్ సంస్థ. ఈ మేరకు స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అమెజాన్ కు అనుమతులు మంజూరు చేసింది.

ఇక అక్క‌డ ఆన్ లైన్ లో అమెజాన్ నుంచి మద్యం డెలివ‌రీ అవ్వ‌నుంది.అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది. కిరాణా నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువును ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు జ‌నం. అందుకే అమెజాన్ మ‌ద్యం కూడా డోర్ డెల‌వ‌రీ చేయ‌నుంది, ఇప్ప‌టికే స్విగ్గి, జొమాటో ద్వారామ‌ద్యం పంపిణీ జరుగుతున్న విష‌యం తెలిసిందే.