ఆయన పుట్టినరోజు గురించి అందరు ఆలోచిస్తుంటే పవన్ ఏంటి ఇలా అనేశాడు ..

ఆయన పుట్టినరోజు గురించి అందరు ఆలోచిస్తుంటే పవన్ ఏంటి ఇలా అనేశాడు ..

0
100

ప్రపంచం లోని మనుషులందరి లో కనిపించే స్వభావాలు కాకుండా కొన్ని అరుదుగా కనిపించే స్వభావాలు ఉంటాయి .అలాంటి స్వభావం గల వ్యక్తులకి పవన్ కళ్యాణ్ ని ఉదాహరణ గ చెప్పవచ్చు . తన కోసం కాకుండా ఎప్పుడు పక్కనోడి కష్టం గురించి ఆలోచించేవాడే పవన్ కళ్యాణ్ అనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు .
అయితే అయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులు చేస్తున్న హడావుడిని ఉద్దేసించి అయన మాట్లాడారు . అయన బర్త్ డే గిఫ్ట్ గా హాస్పిటల్స్ కి ఉచితంగా ఆక్సిజెన్ సిలిండర్లని అందజేసిన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు . చిన్నప్పటి నుంచి పుట్టిన రోజు వేడుకలకి చాల దూరంగా ఉండేవన్నని , తాను మిగతా వాళ్ళకంటే గొప్ప అని ఆ రోజే కాదు ,ఇంత స్టార్ స్టేటస్ వచ్చిన ఇప్పటికి అనిపించట్లేదని అయన అన్నారు . అందరి జనాలలాగా నేను ఓ సామాన్యుణ్ణి అంటూ అయన చేసిన వాఖ్యలు అయన సింప్లిసిటీ కి అద్దం పడతాయి .
ప్రజలు ఆయనపై చూపించే అభిమానం సమాజ మార్పుకి ఉపయోగపడితే ఇంకా సంతోషిస్తానని ఆయన చెప్పిన విషయాలు ఆయనపై అభిమానులని మాత్రమే కాదు ,సమాజం లోని చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి .