అయోధ్య – కొరియా కిమ్ వంశానికి ఉన్నసంబంధం ఏమిటి?

అయోధ్య - కొరియా కిమ్ వంశానికి ఉన్నసంబంధం ఏమిటి?

0
112

మ‌న దేశంలో అయోధ్య- ఎక్క‌డో ఉన్న కొరియా దేశం ఈరెండింటి మ‌ధ్య ఏనాటి నుంచో ఓ అనుబంధం ఉంది అని చ‌రిత్ర చెబుతోంది, ఈ ఆగ‌స్ట్ 5న అయోధ్య‌లో భూమి పూజ జ‌రిగిన స‌మ‌యం నుంచి ఈ వార్త మ‌రింత వైర‌ల్ అవుతోంది, అయితే దీని వెనుక ఓ స్టోరీ చ‌రిత్ర తెలియ‌చేస్తోంది.

క్రీ.శ.48 లో అయోధ్యలోని మిశ్రా కుటుంబానికి చెందిన యువరాణి సూరి రత్న ప‌డ‌వ ప్ర‌యాణం చేశారు, ఈ స‌మ‌యంలో వారి న‌మ్మ‌కం ప్ర‌కారం ఓ రెండు చేపలు ముద్దాడుతున్న రాయిని పడవలో పెట్టుకొని సముద్రం మార్గం ద్వారా కొరియాకు చేరుకున్నారు.

అక్క‌డ కొంత కాలం ఉండి కొరియాలో ఉన్న కారా వంశానికి చెందిన తొలి రాజు కిమ్‌ను వివాహం చేసుకున్నారు, అంతేకాదు ఆమె పేరు హో వాంగ్ ఓక్ అని పెళ్లికి మార్చుకున్నారు, అలా వారికి ప‌ది మంది సంతానం క‌లిగారు,

ఇక ఆమె అయోధ్య ప్రాంతానికి చెందిన వారు అని అక్క‌డ వారు న‌మ్ముతారు, ఆమె తెచ్చిన చేప‌ల రాయి కొరియాది కాదు అది భార‌త‌దేశంలో అయోధ్య నుంచి తెచ్చిన రాయి అని అక్క‌డ చ‌రిత్ర‌లో రాసి ఉంది
అందుకేచాలామంది కొరియన్స్ భారత్ లోని అయోధ్య తమ పుట్టినిల్లుగా భావిస్తారు.అందుకే ఏటా ఇక్కడికే వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని సందర్శించుకోవడానికి వస్తారు. ఈ వేడుక‌ను కూడా చాలా మంది వీక్షించార‌ట‌.