అయోధ్యపై జగన్ కీలక వ్యాఖ్యలు

అయోధ్యపై జగన్ కీలక వ్యాఖ్యలు

0
123

అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…

ప్రజలందరు కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేశారు జగన్… కాగా అయోద్య లోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్ కు అప్పగించాలని అప్పటివరకు అది కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉండాలని న్యాయస్థానం కోరింది… అలాగే అయోద్యలోనే మసీదు నిర్మానానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే