కరోనా వ్యాక్సిన్‌ పై బాబా రాందేవ్ సంచలన కామెంట్స్..వారిని టార్గెట్ గా..

0
110

కరోనా వ్యాక్సిన్‌ పై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బూస్టర్ డోసు వేసుకుంటే అది కాస్త మళ్లీ.. ‘కరోనా’ వచ్చేందుకు కారణమైందని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు.

అమెరికాను టార్గెట్ చేస్తూ.. ‘మేమే ప్రపంచానికి చక్రవర్తులం. మా కంటే గొప్పవారెవరూ లేరు అనుకోవడం తప్పు. ఇకపై ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తుంది’ అని బాబా రాందేవ్ అన్నారు.

కోట్లాది మంది ప్రజలు తమ ఇంటి వెలుపల తులసి, కలబంద, తిప్ప మొక్కలను పెంచుతున్నారని అన్నారు. ఈ చెట్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. అలాగే తిప్ప చెట్టుపై పరిశోధనలు చేసి.. మందులు తయారు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు.