బాబ్రీ నేలమట్టం ఎలా జరిగింది దారుణమైన సంఘటన

బాబ్రీ నేలమట్టం ఎలా జరిగింది దారుణమైన సంఘటన

0
81

మన దేశంలో అత్యంత సున్నితమైన వివాదాస్పద కేసు ఏమైనా ఉంది అంటే అది అయోధ్య కేసు అనే చెప్పాలి అక్కడ మసీదు ఉందని అంటే, కాదు రామ జన్మభూమి అని కొందరు ఇలా రెండు మతాల మధ్య వివాదం చెలరేగింది.. దీనిపై 1885లోనే తొలిసారిగా కోర్టులో కేసు వేశారు, చివరకు ఇలా అనేక వివాదాలతో నేటి తీర్పుకి రెడీ అయింది ఈ కేసు.

అసలు 1990ల్లో రామజన్మభూమి వివాదం పతాకస్థాయికి చేరింది అనే చెప్పాలి. 1992 డిసెంబరు 6న లక్షలమంది కరసేవకులు బాబ్రీమసీదును నేలమట్టం చేశారు. మన దేశంలో అత్యంత దారుణమైన ఘటనలు జరిగిన రోజుగా దీనిని చెప్పాలి.. ఇక ఈ సంఘటన ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. మసీదు విధ్వంసానికి దారితీసిన కారణాలపై జస్టిస్‌ మన్మోహన్‌సింగ్‌ లిబర్హాన్‌ కమిషన్‌ వేశారు.దీనిపై రాజకీయ పార్టీలు కూడా నానా యాగీ చేశాయి.

మొత్తానికి ఈ కేసు పూర్వోపరాలు చూస్తే 1992-2002 మధ్య అలహాబాద్‌ హైకోర్టులో వాదనలు చురుగ్గానే సాగాయి. మసీదు కింద ఆలయం ఉండేదా.. అన్న విషయాన్ని తేల్చాల్సిందిగా 2002లో అలహాబాద్‌ హైకోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది. 2003లోనే తన నివేదిక ఇచ్చినా ఆ తరువాత ఏడేళ్లపాటు కేసు అలా సాగుతూనే వచ్చింది. 40 రోజుల పాటు ఇటు ఇరువురి మాటలు విన్న సీజే నేడు 10.30 కి తీర్పు ఇవ్వనున్నారు.