బాబుకు షాక్ ఇస్తూ జగన్ కుజై కొట్టిన జేసీ

బాబుకు షాక్ ఇస్తూ జగన్ కుజై కొట్టిన జేసీ

0
78

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి రెచ్చిపోయారు… చంద్రబాబు కంటే చిన్నవాడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ అని అన్నారు.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…

చంద్రబాబు నాయుడు గంటలు గంటలు చర్చలు ఆపేస్తే మంచిదని అన్నారు… ఆయన కంటే చిన్నవాడైన జగన్ సూటిగా సుత్తిలేకుండా పని చేసుకుంటూ పోతున్నాడని అన్నారు… కొత్తగా జగన్ చురుగ్గా పని చేస్తున్నారని అన్నారు… తామేమి చిన్నపిల్లలం కాదని అన్నారు…

గంటలు గంటలు చర్చలు జరిపి సమస్యల గురించి వివరిస్తారని జేసీ అన్నారు… కానీ జగన్ అరగంటలో మీటింగ్ ను ఫినిష్ చేసి వాటికి సోల్యూషన్ వెతుకుతారని అన్నారు జేసీ.. ఇక నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కూర్చీ వేసుకుని పార్టీలోని సమస్యలను వినాలని అంతేకాని చుట్టూ వందిమాగధుల మాటలు వింటే లాభం లేదని అన్నారు…