బస్సు ప్రయాణం చేయాలనుకుంటున్నారా బ్యాడ్ న్యూస్

బస్సు ప్రయాణం చేయాలనుకుంటున్నారా బ్యాడ్ న్యూస్

0
119

మొత్తానికి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఈ సమయంలో ఎక్కడ వారు అక్కడే మళ్లీ ఉండిపోతున్నారు, కేసులు ఇలా భారీగా నమోదు అవుతున్న వేళ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక మళ్లీ చాలా చోట్ల కేసులు భారీగా రావడంతో లాక్ డౌన్ పెడుతున్నారు. ఈ సమయంలో బస్సులు కూడా మళ్లీ రద్దు అవుతున్నాయి.

అసలే తక్కువ సంఖ్యలో నడుస్తున్న బస్సులు ఇప్పుడు మళ్లీ రద్దు అవుతున్నాయి.
బెంగళూరుతో పాటు కర్ణాటక నుంచి బస్సుల్లో రావాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. ఏపీ-కర్ణాటక మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 15 నుంచి సర్వీసులు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 23 వరకు పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి దీంతో బస్సులు నడిచే అవకాశం లేదు అంటున్నారు అధికారులు. ఇక ఏపీలో కూడా వెస్ట్ ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో కేసులు భారీగా వస్తున్నాయి అందుకే ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఉదయం 11 గంటల వరకూ కొన్ని బస్సు సర్వీసులు నడుస్తాయని అంటున్నారు.