అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి చేదు అనుభూతి ఎదురు అయింది…. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని కంబాలకొండలో పార్టీ తరపున కాపుల ఆత్మీయ కలయిన అనే కార్యక్రమం నిర్వహించారు…
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయ సాయిరెడ్డి అలాగే పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసురావు హాజరు అయ్యారు… ఈ కార్యక్రమంలో కొంతమంది కాపులు విజయసాయిరెడ్డిని చూడగానే జై కాపు జైజై కాపు అని నినాదాలు చేశారు…
దీంతో అక్కడ కాసేపు గందర గోళవాతావరణం ఏర్పడింది… కాపుల సమావేశానికి అందరి నేతలను ఎలా తీసుకువస్తారని కాపు కార్యకర్తలు ఆరోపించినట్లు తెలుస్తోంది… తాను కూడా కాపులో ఒక్కడినని చనిపోయే ముందు తన డెత్ సర్టిఫికెట్ మీద కాపు అంటూ ఉంటుందంటూ చెప్పారు విజయసాయి రెడ్డి..