వాహానాలు ముఖ్యంగా కార్లు బైకులు కొనాలి అని చూస్తున్నారా, అయితే మీకు ఓ బ్యాడ్ న్యూస్, వచ్చే ఏడాది నుంచి బైక్ కార్ల ధరలు పెరగనున్నాయి, ముఖ్యంగా దీనికి కారణం ఇన్ పుడ్ వ్యయం పెరగడం అని తెలియచేస్తున్నాయి కంపెనీలు..
కార్లు, బైకుల తయారీలో ఉపయోగించే ఉక్కు, ప్లాస్టిక్, అల్యూమినియం ధరలు పెరగడంతో ఈ తయారు వ్యయం భారీగా పెరిగింది.
దీంతో అన్నీ ప్రముఖ కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేశాయి.. కొన్ని కంపెనీలు ఇంకా ప్రకటన చేయలేదు, అయితే ఎంత పెరుగుతుంది అంటే మోడల్ కార్స్ బట్టీ దాదాపు 28 వేల రూపాయల వరకూ గరిష్టంగా పెరిగే ఛాన్స్ ఉంది అని తెలియచేస్తున్నారు ఆటో మొబైల్ ఇండస్ట్రీ నిపుణులు.
జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అటు ద్విచక్రవాహన తయారీ కంపెనీ కూడా దాదాపు 1500 వరకూ పెంచుతున్నట్లు తెలుస్తోంది.. బైకులు ధరలు కూడా దాదాపు 1500 నుంచి 8500 వరకూ మోడల్ బట్టీ పెరగనున్నాయి.