నగరి లో నాకు తిరుగులేదంటూ రోజా చేసిన వాఖ్యలు ఎవరు మరిచిపోరు .వరుసగా రెండుసార్లు నగరి ఎమ్మెల్యే గా గెలిచిన రోజా ఎప్పటికప్పుడు ఎవరో ఒక ప్రతిపక్ష నాయకుడిపై పంచ్ లు వేస్తూ మీడియా లో హల్చల్ చేస్తుంటారు .రోజా నోటికి పనిచెప్పిందంటే ఫైనల్ గా ఎదో ఒక సంచలనం రేపుతోంది .అయితే ఆమె పై రివర్స్ లో స్పందించే ప్రతిపక్షాల సంగతి ఎలా వున్నా ఇప్పుడు నగరి రైతుల విషయం లో ఆమెకు చుక్కెదురైంది…
వివరాల్లోకి వెళ్తే అమరావతి రైతులకు మద్దతిస్తూ నగరి రైతులు చేపట్టిన ఆందోళన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. 250 రోజులుగా అమరావతి ఆర్తనాదాలు వినిపిస్తున్న మీ నాయకుడికి కొద్దిగైనా వాళ్ళ బాధ పట్టడం లేదా అంటూ రైతులు ఆమె పై రివర్స్ అయ్యారు . రైతు రాజ్యమంటూ చెప్పుకునే ఈ పాలనలో రైతులకి అండగా నిలబడలేకపోతున్న మీ అసమర్ధతని ఏమనాలి అంటూ రైతులు అమరావతి విషయం పై ఆమెని ప్రశ్నించారు .
రోజా వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నా మహిళలు అమరావతి రైతులకు సపోర్ట్ గా నిలవాలని ఆమెని కోరారు .వారిపై వివక్షని చూపడం తగదని వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని లేదంటే ఈ రైతు ప్రభుత్వం అంటూ మీరు చేసిన వాగ్దాలకి విలువ ఉండదంటూ వాళ్ళు వాదించారు .
అమరావతి రైతులకి మేమంతా మద్దతుగా ఉంటామని నగరి నియోజక వర్గ ప్రజలు చెప్పడం తో రోజక్క ఆలోచనలో పడింది .వ్యతిరేకత మొదలవ్వడానికి ఇదే మొదటి స్టెప్ అవుతుందేమో అన్న అనుమానం లో రోజా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి