పబ్ లో రాత్రి పట్టు బడిన బడా హీరో కూతురు – సీఐ సస్పెండ్

0
67

హైదరాబాద్‌లో లేట్ నైట్ పార్టీ కల్చర్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. అలాంటి ఘటనే బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ మిగ్ పబ్లో జరిగింది. ఈ ఘటనలో కొంత మందిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.

వారిలో ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు వస్తున్నాయి. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా నాగబాబు కూతురు నిహారిక, MP గల్లా జయదేవ్ కుమారుడు, మాజీ MLA నందీశ్వర్ గౌడ్ కుమారుడు, మాజీ DGP కూతురు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంకా తదితరులు ఉన్నారు.

అంతేకాదు ఈ ఘటనలో పోలీసులు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పబ్ బంజారాహిల్స్ పీఎస్ కి అతిసమీపంలో ఉంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో బంజారాహిల్స్ సీఐను కూడా సస్పెండ్ చేశారు.