బద్వేలు ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి ఇతర పార్టీల గుర్తులన్నీ కొట్టుకుపోతున్నాయి. రౌండ్ రౌండ్‌కి అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లు ముగిశాయి. 8వ రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి సుధాకు 9,691 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 1,964 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 774 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొత్తంగా 68,492 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధా కొనసాగుతున్నారు. బద్వేల్‌లో తొమ్మిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు వైసీపీకి 77 వేల 7 ఓట్ల ఆధిక్యత లభించింది. 9వ రౌండ్‌లో వైసీపీకి 11,354 ఓట్లు రాగా, బీజేపీకి 2,839, కాంగ్రెస్‌కు 439 ఓట్లు లభించాయి.
8వ రౌండ్‌లో వైకాపాకు 9691, భాజపా – 1964, కాంగ్రెస్ – 774, నోటా – 364 ఓట్లు
8 రౌండ్లు ముగిసేసరికి వైకాపా – 84,682, భాజపాకు 16,190, కాంగ్రెస్ – 5,026, నోటా – 2,830 ఓట్లు